Tuesday, December 12, 2023

అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ christamas song Lyrics in telugu

అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ Lyrics - Ramya Garu


అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ
Singer Ramya Garu
Composer K Y Ratnam
Music K Y Ratnam
Song WriterG Purushotham Babu

Lyrics

అందరు మెచ్చిన అందాల తార

అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)

క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్

మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||



సృష్టికర్తయే మరియ తనయుడై

పశుల పాకలో పరుండినాడు (2)

నీతి జీవితం నీవు కోరగా

నీకై రక్షణ తెచ్చినాడు (2)

నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||



ఇంటిని విడిచి తిరిగిన నాకై

ఎదురు చూపులే చూచినాడు (2)

తప్పును తెలిసి తిరిగి రాగా

క్షమియించి కృప చూపినాడు (2)

ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||



పాత దినములు క్రొత్తవి చేసి

నీలో జీవము నింపుతాడు (2)

కటిక చీకటే వేకువ కాగా

అంబరమందు సంబరమాయే (2)

హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||




అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ Watch Video

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template